విష్ణుప్రియ గురించి వెటకారంగా...టేస్టీ తేజ
on Dec 3, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో టేస్టీ తేజ తను ఎంటర్‌టైనరే కాకుండా గేమ్స్ ఆడగలనని, తన అమ్మ కోసం బిగ్ బాస్ కి వచ్చానంటూ చెప్పడం.. ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ అమ్మ ఎంట్రీ కోసం హౌస్ తో పాటు ఆడియన్స్ ఎదురుచూడటం గొప్పగా ఉంది. ఇక అతను ఎలిమినేషన్ తర్వాత బజ్ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలని షేర్ చేసుకున్నాడు.
హౌస్‌లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్ల ఫొటోలు వేసి వాళ్ల ఆటపై నీ అభిప్రాయమేంటి అంటూ యాంకర్ అడిగాడు. దీనికి ఒక్కొక్కరికీ ఒక్కోలా ఆన్సర్ ఇచ్చిన తేజ.. విష్ణుప్రియ ఫొటో వచ్చినప్పుడు మాత్రం వెటకారంగా నవ్వాడు. విష్ణుప్రియ గురించి ఏం చెప్పాలి.. పాజిటివా నెగెటివా .. ఏం చెప్పాలో కూడా తెలీడం లేదు.. సూస్తా ఉన్నా నడుస్తా ఉంది బండి.. ఎందుకు నడుస్తుందో అర్థం కావట్లేదు.. ఎలా నడుస్తుందో అర్థం కావట్లేదు.. విష్ణుప్రియ అనే వ్యక్తి తెలీని పర్సనల్‌గా హౌస్‌లోకి వచ్చి ఉంటే నాలుగు లేదా ఐదో వారమూ నీ ముందుండేది.. జనాలకి తెలీడం వల్ల 13వ వారం దాకా ఉందంటూ తేజ అన్నాడు. దీంతో టాప్-5లో ఉంటుందా విష్ణు అంటూ యాంకర్ అడిగాడు. దీనికి ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా నా టాప్-5 అయితే గౌతమ్, నిఖిల్, నబీల్, అవినాష్ అన్నా.. చివరి ప్లేస్ నాకు అయితే రోహిణి గారికి ఇవ్వాలనుంది.. పృథ్వీ టాప్-5లో ఉండడనేది నా గట్ ఫీలింగ్.. అంటూ తేజ బదులిచ్చాడు. మరి పృథ్వీ, విష్ణుప్రియ, ప్రేరణ ముగ్గురూ వచ్చేస్తారా బయటికి.. అంటూ అర్జున్ అడిగితే ముగ్గురు టాప్-5లో ఉండరనేది నా భావన.. ఆ ముగ్గురిలో మహా ఉంటే ఒక్కరికే ఛాన్స్ ఉంటది.. ఆ ఒక్కళ్లు ఎవరో నేను ఇప్పుడు చెప్పలేనంటూ తేజ అన్నాడు.
టేస్టీ తేజ బిబి బజ్ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు పృథ్వీ ఇంకా ఎలిమినేషన్ అవ్వలేదు. కానీ అంత కాన్ఫిడెంట్ గా ఎలా ఊహించాడో తెలియదు. అందుకే హౌస్ లో కాస్త జీనియస్ ఎవరంటే తేజ అంటారు. టాప్-5 లో ఉండేవాళ్ళలో నిఖిల్, నబీల్, గౌతమ్, అవినాష్ అని మాత్రం కరెక్ట్ గా ఆడియన్స్ పాయింటాఫ్ వ్యూ లో గెస్ చేశాడు తేజ. ఇక ఇతను ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Also Read